యాదవుల దేవీదేవతలు ప్రజల రక్షకులు!

lord sri krishna god of yadavs

యాదవుల దేవీదేవతలు ప్రజల రక్షకులు!

మల్లన్న దేవుడు ఎందుకయ్యాడు?
అతడు జనం కోసం పోరాడిన రాజు కాబట్టే.
ఈ ధోరణి కేవలం మల్లన్న వద్ద ఆగిపోలేదు..
కృష్ణుడి నుంచి కాటమరాజు వరకు – ప్రతీ యాదవుడు ప్రజల కోసం పోరాడి మరణిస్తే, దేవుడవుతాడు!

ఇది శూద్రతత్వం – ఇది యాదవ జీవన ధర్మం.

సింధు నాగరికతతో మొదలై, శాతవాహనుల కాలం దాటి, నేటి తెలంగాణ వరకూ ఈ జానపద సత్యం వెలుగులీనుతోంది.
మనం రాజులను దేవుడిగా మార్చలేదు – ప్రజల కోసం జీవించిన వీరులను దేవుడిగా మన్నించాం!

కృష్ణుడు,పోచమ్మ,మల్లన్న, ఎల్లమ్మ, కాటమరాజు, బీరప్ప,
వీళ్లే మన దేవుళ్లు – వీరే మన నాయకులు – ఇవే మన పోరాటగాథలు!

వీరిలో ఒక్కరు కూడా యజ్ఞాలు చేయలేదు.
వీరిలో ఎవ్వరూ దేవాలయ శాస్త్రాలను రాసుకోలేదు.
వాళ్లు జనం కోసం యుద్ధం చేసి, మన గుండెల్లో దేవుళ్లుగా నిలిచారు!

ఇది పూజ కాదు – ఇది జ్ఞాపకం.
ఇది భక్తి కాదు – ఇది చరిత్ర.
ఇది మతం కాదు – ఇది మానవత్వం!

ఇప్పుడు బ్రాహ్మణాధిపత్యం వీరిని త్యాగబలి చేసిన రాజులుగా కాకుండా,
శాంతమూర్తులుగా మలచాలని చూస్తోంది!

మనం తిరిగి మన దేవుళ్లను మనం క్లైయిమ్ చేసుకోవాలి – రాజులుగా – రక్షకులుగా – మన జ్ఞాపకాలుగా!

-శివశంకర్ యాదవ్ మ్యాకల
(సోషల్ మీడియాలో షేర్ అవుతున్న మంచి మాటలు..నిజమైన మన వారసత్వం..రచయితకు అభినందనలు..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
en_USEnglish