సాధిద్దాం..సాధిద్దాం..అహిర్ రెజిమెంట్ సాధిద్దాం!
పల్లవి: స్వాగతం సుస్వాగతం.. మన రెజాంగ్ల కలశయాత్రకు
వందనం వీరచందనం.. మన అహీరూ సైనికులకు
అమరులైన మన యాదవ.. అహీరూ రెజిమెంట్ కు =అమ= స్వాగ=
1వ చరణం:
ఇప్పటిదాక అప్పటిదా యెప్పటిదో.. మన అహీరు సేన
మహా భారతయుద్ధంలో.. ఇది నారాయణసేన
మధ్యయుగ రాజ్యాలలో.. పోరాడిన మహాసేన
స్వాతంత్ర్య పోరాటంలో.. సాహసం చూపిన సేన
నేటి స్వాతంత్ర్య భారతంలో.. మేటిది ఈ అహీరు సేన
పరమవీరచక్ర, మహావీరచక్ర..పతకాలను పొందిన సేన =పర=స్వాగ=
2వ చరణం:
పందొమ్మిదీ వందలా.. ఆరువదీ రెండులో
భారత చైనా యుద్ధ..లఢాక్ రెజాంగ్లలో
పదమూడొందల మందీ.. చైనా సైనికులను చంపి
నూట పద్నాలుగురూ..అమరులైరీ అహీరులు
పాకిస్తాన్ కార్గిల్ యుద్ధాలతో.. బహుబలులయిరి ఈ అహీరులు =పాకి= స్వాగ=
3వ చరణం:
అహిరు అంటేనే.. భయములేని వీరుడు
పౌరుషానికి పరాక్రమానికీ.. తిరుగులేని శూరుడు
సిక్కు రాజపుత్ర జాటూ డోగ్రాలకు.. రెజిమెంట్లు వున్నట్లే
వీరులైన అహీరులకు.. రెజిమెంటూ వుండాలి =వీరు=
యెవరు సాటి యెవరు మేటి .. మన అహీరూ సేనకు
మనము పోరు చేయ్యాలి.. ఇది సాధించేవరకు =మనము= (3)
(తెలంగాణ రాష్ట్రంలో రెజాంగ్ల కలశయాత్ర పర్యటించిన సందర్భంగా.. స్వాగతం పలుకేందుకు ఈ గేయం రాయబడింది. అహీరు రెజిమెంట్ ను సాధించేవరకు పోరాడుదాం..)
(కలశయాత్ర స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వంతో తెలంగాణలోని యాదవులు అందరూ ఐక్యంగా పోరాడాలని కోరుకుందాం)
గీత రచన
వల్లాల అచ్చయ్య పరంధామ్
(కవి రచయిత)
లింగమంతుల జాతర అధ్యయన పీఠం, వ్యవస్థాపకులు,
విశ్లేషకులు, నల్లగొండ.
సెల్ 9985909046
