బీపీ మండల్ ట్రస్ట్ ఆవిష్కరణ..‘డాక్టర్ అలా’ 40 సెంట్ల భూమి వితరణ

doctor ala venlateswarlu donates land

బీపీ మండల్ ట్రస్ట్ ఆవిష్కరణ..‘డాక్టర్ అలా’ 40 సెంట్ల భూమి వితరణ

గుంటూరు: బీసీల అభ్యున్నతి కోసం సరైన వేదిక ఉండాలనే ఆలోచనతో శాశ్వత భవన సముదాయానికి తన వంతు సాయంగా రాజధాని ప్రాంతంలో 40 సెంట్ల ఖరీదైన భూమిని డాక్టర్ అలా వెంకటేశ్వర్లు బీపీ మండల్ ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు. జూన్ 1న ఏటుకూరు రోడ్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో డాక్టర్ అలా వెంకటేశ్వర్లు, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత ఉప కులపతి శ్యాంప్రసాద్, ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, మరికొందరు యాదవ ప్రముఖుల నేతృత్వంలో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులతో పాటు అవసరమైన ప్రతీ బీసీ కుటుంబాన్ని ఆదుకునేలాగా అనేక కార్యక్రమాలు మున్ముందు చేపట్టడానికి ట్రస్ట్ నిర్వాహకులు కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు డాక్టర్ అలా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంప్లాయిమెంట్ అధికారి రజినిప్రియ, కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ అలా అనురాధ, కె. నాగభూషణం, మధు, దాసరి శివకుమార్, ఏపీ టీడీసీ చైర్మన్ ఎం. బాలాజీ, డాక్టర్ శ్యాంప్రసాద్, పోతురాజు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
en_USEnglish