అహిర్(యాదవ) రెజిమెంట్ ఎందుకు కావాలంటే..?

ahir rejiment importance

ప్రపంచంలోనే భారత సైన్యం అతిపెద్ద రెండో సైన్యంగా, నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యంగా కొనసాగుతోంది. ఈ అతిపెద్ద సైన్యంలో అత్యధిక సైనికులు దేశంలోని అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. త్రివిధ దళాలలో వివిధ హోదాల్లో బాధ్యతగా ఎంతో ధైర్యసహసాలతో దేశభక్తితో సాయుధ, రక్షణ దళాలకు సేవ చేస్తూ భారతదేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు. ఇప్పటివరకు యాదవ్ (అహిర్) వీర సైనికులు ప్రాణాలను త్యాగం చేయని యుద్ధం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ యుద్ధాలలో కొన్ని ముఖ్యమైన యుద్ధాల గురించి చూస్తే రెండో ప్రపంచ యుద్ధం, బర్మా యుద్ధం, జపాన్ తో జరిగిన యుద్ధం, ఇండో చైనా యుద్ధం, కార్గిల్ యుద్ధం, అక్షరధామ్, పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి, తాజ్ కృష్ణ పై జరిగిన దాడిలో, పుల్వామా దాడిలో, మొన్న 2025 మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో ఈ విధంగా భారతమాత రక్షణ కోసం జరిగిన అనేక యుద్దాలలో ఎందరో యాదవ (అహిర్) సైనికులు వీర మరణం పొంది నిరంతరం ఈ దేశ ప్రజల గుండెల్లో చిరంజీవులుగా వెలుగొందుతూ తరువాతి తరాల్లో స్ఫూర్తిని రగిలిస్తూ దేశ చరిత్ర పుటల్లో వీర జవానులుగా తమకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటున్నారు. అలాంటి వీర జవానులనేందరినో ఈ భరతమాత రక్షణకై అందించిన వీర వనితలు యాదవ జాతి ముద్దుబిడ్డలు. ఈ భారత సమాజ రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం ముందు ఉన్నతమైన స్థానంలో ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం సింధు నాగరికత నిర్మాణం మొదలు నేటి వరకు నిరంతరం సకల రంగాల్లో అలుపెరుగని పోరాటం చేస్తూ అకుంఠిత‌ దీక్షతో అభివృద్ధి వైపు ప్రయాణిస్తోంది..పరిపాలన దక్షతకు మూలవిరాట్ ప్రపంచ ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవానుని వారసత్వం.

రెజాంగ్ల యుద్ధం -యాదవ (అహిర్) వీరసైనికుల త్యాగం

మన దేశానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన యుద్ధాలలో రెజాంగ్ల యుద్ధం దేశం గర్వించేలా ప్రాముఖ్యతను కలిగినది. 1962 నవంబర్ 18న భారతదేశంలోని ల‌ఢ‌క్ లో గల రెజాంగ్ల పాస్ వద్ద మన సైన్యం చైనాతో పోరాడింది. 13 కుమావోన్ రెజిమెంట్ లో 120 మంది యాదవ సైనికులు ఉన్నారు. వీరికి మేజర్ సైతాన్ సింగ్ యాదవ్ నాయకత్వం వహించారు. 120 మంది భారతీయ యాదవ్ (అహిర్) సైనికులు 5000 మంది చైనీస్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ యుద్ధంలో 1310 మంది చైనా సైనికులను హతమార్చారు. 114 మంది ధైర్యవంతులైన యాదవ (అహిర్‌) సైనికులు భరతమాత రక్షణలో వీరమరణం పొందారు. మూడు నెలల తర్వాత 10 ఫిబ్రవరి 1963 న యుద్ధ భూమిలో ప్రాణాలు పోయినా కూడా ఆయుధాలను విడవని యాదవ (అహిర్) వీర సైనికుల భౌతిక శరీర భాగాలని మంచుతో కప్పబడిన విధానాన్ని పసిగట్టిన గొర్రెల కాపరులు తెలిపిన సమాచారం మేరకు యుద్ధభూమిని సందర్శించిన భారతీయ శోధన బృందం అక్కడ ఘ‌నీభ‌వించిన‌ సైనిక మృతదేహాల చేతుల్లో తుపాకులు ఉండటాన్ని, వారి ఛాతిపై బుల్లెట్లను గమనించి నిర్గాంతపోయింది. యాదవ(అహిర్) శౌర్యం చైనా పురోగతిని విజయవంతంగా ఆపడం ఏ కాకుండా చుషూల్ విమానశ్రయాన్ని ల‌ఢ‌క్‌ ప్రాంతాన్ని రక్షించింది చైనా ఆక్రమించడాన్ని తిప్పి కొట్టింది . ఈ యుద్ధం భారత సైన్య చరిత్రలో పోస్ట్ ఆఫ్ హానర్ గా గుర్తింపు పొందింది.ఈ యాదవ్ వీరుల జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం మరియు భారత సైన్యం రెజాంగ్ల అహిర్ ధామ్‌ కూడా నిర్మించారు . ఇలా ఎందరో యాదవ వీర సైనికులు దేశ రక్షణ కొరకు అనేక యుద్ధాలు చేసి భారతమాత ఒడిలో అమరులయ్యారు.

యాదవు(అహిర్)ల సైనిక వారసత్వం:-

భారత సైన్యం లో యాదవ్ (అహిర్)ల వారసత్వం, క్రమశిక్షణ, దేశ భక్తి, జ్ఞానం,ధైర్యం, పోరాడే తత్వం, నా దేశం ప్రపంచంలో అగ్రగామిగా అన్ని రంగాల్లో నిలవాలని బలమైన ఆకాంక్షతో ఏ దేశం కన్నా నాదేశం సైనిక వ్యవస్థ తక్కువ కాకుడదు నా దేశం అన్ని రంగాల్లో రాణించాలంటే సైనిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ప్రారంభం నుంచే త్రివిధ (నేవీ, ఎయిర్ ఫోర్స్,ఆర్మీ) దళాలలో కొనసాగుతూ వ‌స్తోంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అనేక యుద్ధాల్లో వివిధ హోదాల్లో వీరోచితంగా పోరాడి విజయం సాధించి, ప్రాణత్యాగం చేసి భారత సైన్యంలో అత్యున్నతమైన గౌరవ పురస్కారాలను పొందిన యాదవ్ (అహిర్ )సైనికులు వీర సైనికులు ఎందరో ఉన్నారు. అందులో యాదవ్ (అహిర్)ల “సైనిక వీరోచిత పోరాటమే -భారతదేశ సైనిక చరిత్ర”అన్నంత ఉన్నతంగా భారత సైన్యంలో, ప్రజలహృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని తమకంటూ నిలుపుకున్న యాదవ్ (అహిర్) వీర సైనికులు ఎందరో వివరాలు పరిశీలించి చూస్తే అర్థమవుతుంది.

భారత సైన్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యాదవ(అహిర్) సైనికులు కొంద‌రు:

పద్మభూషణ్ ఉమ్రావ్ సింగ్ యాదవ్:-

1920 నవంబర్ 21న పాల్రా గ్రామం ఝాజ్జర్ జిల్లా, హర్యానా రాష్ట్రంలో (ఆ కాలంలో పంజాబ్, బ్రిటిష్ ఇండియా) లో యాదవ్ (అహిర్ )కుటుంబంలో జన్మించారు. 1939 నవంబర్ లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 19 ఏళ్ల వయసులో భారత సైన్యంలో చేరారు. 1942లో భారత సైన్యంలోని రాయల్ ఇండియన్ ఆర్టిలరీలో హవల్దార్ గా పదోన్నతి పొందారు. శత్రువులను ఎదుర్కొన్న ధైర్య సాహసాలకు బ్రిటిష్, కామన్వెల్త్ దళాలకు ఇచ్చే అత్యున్నతమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం 1945 అక్టోబర్ 15న బంకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ జార్జ్ -6 “విక్టోరియా క్రాస్ “ను ఉమ్రావ్‌ సింగ్ యాదవ్ కు బహూకరించారు. శౌర్యం, విధిపట్ల అంకితభావానికి అత్యున్నత ఉదాహరణగా నిలిచాడు అని ప్రశంసపత్రంలోపేర్కొన్నారు. ఈ ప్రశంస పత్రం అందుకున్న అతి తక్కువ మంది భారతీయ సైనికులలో ఉమ్రావ్ సింగ్‌ ఒకరు. 1944 డిసెంబర్ 15 ,16 న జరిగిన బర్మా (మయన్మార్) యుద్ధంలో ఫీల్డ్ గన్ డిటాచ్మెంట్ కమాండర్ గా, వీరోచితమైన పోరాటపటిమ కనపరిచారు . జపానీస్ 28వ సైన్యం దాడిలో ఇమ్రాన్ సింగ్ యాదవ్ తన చుట్టూ ఉన్న సైనికులు అంతా చనిపోయిన కూడా భయపడకుండా తమ దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్ని అయిపోయిన ధైర్యంగా”గన్ బేరర్”(బరువైన ఇనుప రాడు) ఆయుధంగా ఉపయోగించి సైనికులను కాల్చి చంపే జపాన్ దళాన్ని మట్టికరిపించాడు. పదిమంది జపాన్ సైనికులను చంపడమే కాకుండా ఏడు మంది సైనికులను యుద్ధరంగంలో నుంచి నిలువరించాడు. ఈ దాడిలోతీవ్ర గాయాల పాలైన సింగ్ కోలుకున్న తర్వాత ఆయనకు పదోన్నతి లభించింది 1946లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి పదవి విరమణ చేశారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో తిరిగి సైన్యంలో చేరారు. 1950 ఫిబ్రవరి 1న సింగ్ జూనియర్ కమిషన్ పదోన్నతి పొందారు. ఆయన మే 2 1968న పదోన్నతి పొందారు. ఆగస్టు 15 కెప్టెన్ గౌరవ హోదాలో పదోన్నతి పొందారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్ లో జరిగిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా యూకే అప్పటి ఉప ప్రధాని మైకేల్ హెసెల్టైన్ నుంచి ప్రత్యేక గౌరవాన్ని స్వీకరించారు. లండన్ లోని ఉన్విచ్ సెయింట్ జార్జ్ గారి సన్ చర్చి వద్ద రాయల్ ఆర్డినరీ బ్యారెక్స్ సమీపంలో విక్టోరియా క్రాస్ విజేతల స్మారక చీహ్నంలో అతని పేరు చిరస్థాయిగా లిఖించబడి నేటికి ఉన్నది. సైన్యం నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకున్న చిన్నపాటి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఇతరుల నుంచి ఒత్తిడి ఎదురైనా తను పొందిన పురస్కారాలను,అవార్డులను, ప్రశంసా పత్రాలను అమ్ముకోకుండా యుద్ధంలో మరణించిన సైనికుల గౌరవానికి భంగం కలిగించకుండా చివరి వరకు అలాగే కొనసాగారు. ఆయన 85 పుట్టినరోజున నవంబర్ 21 2005న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని పూర్తి సైనిక గౌరవాలతో తన స్వగ్రామంలో దహనం చేశారు దీనికి హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా, జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ (ఆర్మీ చీఫ్), మరియు లెఫ్టినెంట్ జనరల్ చ‌ర‌ణ్‌జిత్‌ సింగ్ (ఆర్టిలరీ డైరెక్టర్ జనరల్ ) హాజరయ్యారు. వీరు భారతీయ సైన్యంకు సుదీర్ఘమైన సేవలను అందించారు. వీరు దేశ రక్షణ కోసం చేసిన సేవగాను 1983లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వీరు సైన్యానికి చేసిన సేవలు అమోఘమైనవి మర్చిపోలేనివి చరిత్రత్మకమైనవి వీరు దేశం పట్ల చూపిన ధైర్యం శౌర్యం, దేశభక్తి, క్రమశిక్షణ విధి పట్ల అంకితభావానికి ఎన్నో అత్యున్నతమైన పురస్కారాలని పొంది భారత్ సైన్య చరిత్రలో, భారతీయుల హృదయాల్లో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకున్న గొప్ప యాదవ్ (అహిర్) వీర సైనికుడు ఉమ్రావ్ సింగ్ యాదవ్.

బ్రిగేడియర్ రాయ్‌సింగ్ యాదవ్:-

పంజాబ్ ప్రావిన్స్, గురుగావ్ జిల్లా లోని కోస్లీ గ్రామం( ప్రస్తుతం హర్యానాలోని రేవారి జిల్లాలో ఉంది)లో 1925 మార్చు 17 న యాదవ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రాయి సాహెబ్ గణపతి సింగ్ 1920లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. రాయ్ సింగ్ జుల్గుందూర్ లోని కింగ్ జార్జ్ మిలిటరీ స్కూల్ నుంచి సీనియర్ కేంబ్రిడ్జిఉత్తీర్ణుడయ్యాడు. 1944లో సెకండ్ లెఫ్టినెంట్ గా సైన్యంలో చేరారు 1950 డిసెంబర్ 10న ఆయన 2- గ్రేనిడేరియర్ లోని నియమించబడ్డాడు 1967లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో అతను సిక్కిం లోని నాథుల వద్ద మోహరించిన 2- గ్రెనెడ్డియర్స్ బెటాలియన్ కు నాయకత్వం వహించాడు. చైనా సైన్యం భారత ఆధీనంలో ఉన్న భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు ఇది నాథులా, చోళ ఘర్షణలకు దారి తీసింది. నాథుల పాస్ ను పట్టుకోవడానికి, చైనా ప్రయత్నించిన చొరబాట్లను ఓడించడానికి లెఫ్టినెంట్‌ కల్నల్ రాయ్‌సింగ్ యాదవ్ తన సైనికులను ముందుండి నడిపించాడు. శత్రువులను ఎదుర్కొనేందుకు స్పష్టమైన ధైర్యం, అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించాడు. దీనికిగాను ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత సైన్య అలంకరణ అయిన మహావీర్ చక్ర లభించింది. ఆయనను “నాథులా టైగర్” అని కూడా పిలుస్తారు.

బబ్రుభాన్ యాదవ్:-

వీరు 14 సెప్టెంబర్ 1928 బారావాసి గ్రామం, రేవారి జిల్లా, హర్యానా రాష్ట్రం లోని యాదవ కుటుంబంలో జన్మించారు. తండ్రి మేజర్ భగవాన్ సింగ్ యాదవ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పని చేసిన రిటైర్డ్ అధికారి. బబ్రుబాన్ యాదవ్ రేవారిలో ప్రాథమిక విద్య అనంతరం ఢిల్లీలోని ప్రముఖ ఎస్టీ. స్టీఫెన్స్ కాలేజీలో బీ.ఎ.స్సీ పూర్తి చేశారు. తర్వాతి రోజుల్లో మిలిటరీ కాలేజీల్లో చేరి భారత నౌకాదళంలో 1951 లో చేరారు. యూకే లోనీ Hms Vernon నౌక స్థావరంలో Ante -Submarine warfareలో శిక్షణ పొందారు. ఆ తర్వాత రష్యాలోనీ శిక్షణలో భాగంగా Styx క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నేర్చుకున్నారు. 1971 నాటికి ఆయన మిస్సైల్ బోర్డ్ క్వాండర్న్(25 కిల్లర్ స్కాండర్న్) కు కమాండింగ్ ఆఫీసర్ గా పని చేశారు. 1971 డిసెంబర్ 4న రాత్రి భారత నావికాదళం “ఆపరేషన్ ట్రైడెంట్”పేరుతో కరాచీ పోర్టుపై సాయుధ దాడికి సిద్ధమైంది. ఈ దాడికి నాయకత్వం వహించిన వారు బబ్రు భాన్ యాదవ్. ఇతనిని కిల్లర్ ఆఫ్ కరాచీ అని పిలుస్తారు. INS Nipt,INS Nirghat,INSVeer వీరు స్వయంగా కమాండింగ్ చేసిన ప్రధాన నౌకలు.INS Nirghat -పాకిస్తాన్ డెస్ట్రాయర్PNS Khaibar ను మునిగించింది.INS Veer -మైన్స్ లీటర్ PNS Muhafizపై Styx-క్షిపని ప్రయోగించి నాశనం చేసింది.INS Nipat-కార్గో నౌక MV Venus challengerమునిగించి,PNS ShahJahan డిస్ట్రాయర్ ను గాయపరిచింది. అనంతరం కరాచీలోని ఆయిల్ డిపోలపై క్షిపనులతో దాడి చేసి నాశనం చేశారు. ఈ దాడితో పాకిస్తాన్ నౌకాదళం తీవ్రంగాబలహీనపడింది. భారత నావికాదళం ఏ ఒక్క నౌకను కోల్పోకుండా విజయాన్ని సాధించ గలిగింది. ప్రపంచంలోనే అనేక నౌకా దళాల దృష్టిని భారత నేవీ వైపు తిప్పిన ఘనత బబ్రుభాన్ యాదవ్ దే. భారతదేశ సైనిక చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిన నావికదళపు కథలు ఎందరో రణవీరుల బలి దానంతో రూపొందినవే. అలాంటి కథల్లో అగ్రస్థానంలో నిలిచినది కమోడోర్ యాదవ్ గారి కథ. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కరాచీ పోర్టుపై జరిగిన ధ్వంసకరమైన దాడి- ఆపరేషన్ ట్రైడెంట్ వెనక ఉన్న నేతృత్వ శక్తి వ్యూహావేత్త, సైనిక వీరుడు బబ్రుభాన్ \ యాదవ్. అతడు భారత నావికాదళ చరిత్ర లో రెండవ అత్యంత యుద్ధ పుర స్కారం “మహావీర్ “చక్ర పొందిన మొట్టమొదటి అధికారి. వీరి నేతృత్వంలో పనిచేసిన బాట్స్ కు చెందిన ఇతర కమాండర్ లకు” వీర్ చక్రష‌ గౌరవ పురస్కారం పొందారు. కరాచీ తుపాకీ గుండుతో రణరంగం రాసిన సముద్ర వీరుడు బబ్రుబాన్ యాదవ్ అని వీరిని పొగడడం జరుగుతుంది. 1982లో నేవీ నుంచి కమె డోర్ హోదాలో పదవి విరమణ పొందిన తర్వాత N.C.C డైరెక్టర్ గా చండీగర్లో విధులు నిర్వర్తించారు. సైనికసేవ అనంతరం యువతనుదేశంవైపుఆకర్షించేందుకు పనిచేశారు. వీరి పేరు వినిపించ గానే కరాచి పై జరిగిన అపూర్వ విజయ దాడి, భారత నౌకాదళ గర్వకారణమైన” ఆపరేషన్ ట్రైడెంట్, సాహసికతకు నిలువెత్తు ఉదాహరణ” గుర్తుకొస్తాయి. వీరు చూపిన దేశభక్తి ధైర్యసహసాలతో సమర్థవంతమైన నాయకత్వ శక్తి తో భారత నేవీ సాధించిన ఘనత వల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీని “నేవీ ‘డే గా నిర్వహించడం జరుగుతుంది.

లెఫ్టినెంట్ జనరల్ జై భగవాన్ సింగ్ యాదవ్:-
వీరు హర్యానా రాష్ట్రం,మహేంద్రగడ్ జిల్లా, అచీన గ్రామంలో జన్మించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈయన చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలను అలవర్చు కున్నారు. వీరు భారత సైన్యంలో అత్యున్నత పదవిని అధిరోహించిన ఒక అపూర్వమైన సైనిక అధికారి. సైనిక జీవితం దేశ సేవకు అంకితమైంది. 1964 సంవత్సరంలో భారత సైన్యంలో ఆయన 11వ గోర్కా రైఫిల్ బెటాలియన్ లో లెఫ్టినెంట్ హోదాలో ప్రవేశించారు . అత్యుత్తమ శిక్షణను పొంది ప్రారంభం నుంచే ధైర్య సాహసాలకు పేరు తెచ్చుకున్నారు. 1965 భారత్ పాక్ యుద్ధంలో తన గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. శత్రువును ఎదుర్కొని అప్రతిహతంగా పోరాడారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం)లో జై భగవాన్ సింగ్ యాదవ్ ప్రదర్శించిన ధైర్యసహసాలకు అత్యంత గౌరవమైన “వీర్ర్ చక్ర”(Veer chakra) పురస్కారం లభించింది. 1992 నుంచి 1994 వరకు అతను రాష్ట్రంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాష్ట్రీయ రైపిల్ కు నాయకత్వం వహించాడు. ఆయన నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తానీ బలగాలను పోగ్రా ప్రాంతంలో చుట్టుముట్టి ఓడించింది. శత్రు ప్రధాన కేంద్రాలను అధిగమించి సీయాల్కోట్-సిలిగురి కారిడార్ను కాపాడే వ్యూహాలు అమలు చేశారు. వీరు ఈ పోరాటాల్లో ప్రదర్శించిన శౌర్య నాయకత్వం భారత సైన్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. లెఫ్టినెంట్ జనరల్ జై భగవాన్ సింగ్ యాదవ్ తమ సేవల ద్వారా భారత సైన్యంలో పలు ముఖ్యమైన హోదాల్లో పనిచేశారు. రాష్ట్రీయ రైఫిల్ కమాండర్ గా:-మిలిటెంట్ల యుద్ధం పై,16వ,Corps Goc:-జమ్మూ కాశ్మీర్ పరిధిలో యాక్టివ్ ఆపరేషన్లు, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సెప్టెంబర్ 2002 నుండి ఫిబ్రవరి 2005 వరకు మరియు పలు సైనిక శిక్షణ కేంద్రాల్లో వ్యూహాత్మక నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. వీరు సైనిక జీవితంలో అత్యున్నత పథకాలలైన వీరు చక్ర, పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవ పథకం, విశిష్ట సేవా పథకం ఆయన యొక్క ధైర్యానికి, నిబద్ధతకు ,త్యాగానికి, సేవా తపన,కు చిహ్నాలుగా సైనిక పురస్కారాలు మరియు గౌరవాలను పొందారు. 2005లో లెఫ్టినెంట్ జనరల్ జై భగవాన్సింగ్ యాదవ్ పదవి విరమణ తర్వాత దేశ సేవను కొనసాగిస్తూ జాతీయ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నారు. 2019లో వీరు భారతీయ జనతా పార్టీలో చేరి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గా ఆయన జవాన్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.

పరమవీరచక్ర యోగేంద్ర సింగ్ యాదవ్:-

వీరు 10 మే 1980 అఘాస్ హరియాన్ గ్రామం, బులంద్ షహర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ లో యాదవ్ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి కుమార్ సింగ్ యాదవ్ భారత సైన్యంలో పూర్వ సైనికుడు. యోగేంద్ర యాదవ్ గారి కుటుంబం దేశ సేవా సంప్రదాయంతో నిండిన కుటుంబం. చిన్నతనంలోనే సైన్యంలో చేరాలన్న కోరికతో ఎదిగాడు. దేశానికి రక్షణ కావాలని అనుకున్న ఒక యువకుడు ఒక గొప్ప యుద్ధ వీరుడు అయ్యాడు. బలాన్ని కాదు ధైర్యాన్ని ఆయుధంగా మార్చుకొని 17 సంవత్సరాల వయసులో 1996లో గ్రెనే డీయర్స్ రెజిమెంట్ లో చేరాడు. శిక్షణ పూర్తి చేసిన వెంటనే అతన్ని హిందూ పర్వత ప్రాంతంలో ప్రత్యేక విధులకు పంపారు. అతడి శక్తి క్రమశిక్షణ దేశభక్తి అతని త్వరగా అధికారి స్థాయికి చేర్చాయి. 1999 జులై 4వ తేదీ రాత్రి కార్గిల్ యుద్ధంలో కీలకమైన టైగర్ హిల్ పై ఆధిపత్యం సాధించడం అత్యవసరంగా మారింది. ఈ హిల్ పాయింట్ పాక్ దళాల చేతుల్లో ఉండటంతో దానిపై ఆధిపత్యం లేకుండా విజయాన్ని సాధించలేమని గమనించిన యోగేంద్ర సింగ్ యాదవ్ Ghatak Platoon లో ఉంటూ పర్వతం పైకి ఎక్కేందుకు ముందుగా వెళ్లే మార్గంలో 1000 అడుగుల ఎత్తుగలకొండను బలమైన తుపాకుల కాల్పుల మధ్య తాడు సహాయంతో ఎక్కి పనిని ప్రారంభించాడు. ఆయనకు దాదాపు 17 బుల్లెట్లు ఎడమ చేతుకు భుజం భాగాల్లో, శరీరానికి తగిలినప్పటికీ భయపడకుండా శత్రువుల బంకర్లపై గ్రైనేడ్లు విసిరి శత్రువులను నాశనం చేశాడు. మిగిలిన భారత సైనికులకు రహదారి సాఫీ చేశాడు. ఆయన ధైర్యంతో టైగర్ హిల్ పై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ బార్డర్లో సైనికుడా భారత్ రక్షకుడా.. అనే పాట ప్రతి తెలుగు వారి గుండె శబ్దం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మద్దతు ప్రకటించాయి.

భారతమాత పిలిస్తే ప్రాణాలు అర్పించడానికి బాధ్యతగా సిద్ధంగా ఉండే వ్యక్తిత్వానికి జీవ చిరునామ మన యోగేంద్ర సింగ్ యాదవ్. ఇతడు భరతమాత రక్షణ కోసం పోరాడిన తీరు పాఠశాల విద్యార్థులకు, యువతకు, నాయకులకు, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుంది. అతడి ధైర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో అత్యున్నత యుద్ధ గౌరవం ” “పరమవీరచక్ర”ను ప్రధానంచేసింది. అతి చిన్న వయసు (19Yrs)లో మొట్టమొదటి సారిగా దేశ అత్యున్నత సైనిక పురస్కారం “పరమవీరచక్ర”అందుకున్న యాదవ సైనిక వీరుడు యోగేంద్ర సింగ్ యాదవ్.ఈ వీరుడి వీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని 2003లో బాలీవుడ్ చిత్రం”Lok Kargil”ను మురళీ శర్మ నటుడిగా రూపొందించడం జరిగింది. దూరదర్శన్ అండ్ నేషనల్ జాగ్రఫీ వంటి సంస్థలు ఈ వీర సైనికుని మీద ప్రత్యేక డాక్యుమెంట‌రీలు రూపొందించారు. 2020 లో అమితాబచ్చన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన” కౌన్ బనేగా క‌రోడ్ ప‌తి షో”లో పరమవీరచక్ర గ్రహీత సుబేదార్ సంజయ్ కుమార్ తో కలిసి పరమవీరచక్ర యోగేంద్ర సింగ్ యాదవ్ పాల్గొన్నారు. వారు ఇందులో గెలుచుకున్న 25 లక్షలు మొత్తం ఆర్మీ వెల్ఫేర్ పండ్ కు విరాళంగా ఇచ్చారు. 2015లో దేశానికి ఆయన చేసిన సేవలకు గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర అత్యున్నత గౌరవ పురస్కారం “యశ్ భారతిష‌నీ ప్ర‌దానం చేసింది.

ఈ విధంగా మహావీర్ చక్ర చవన్ సింగ్ యాదవ-1971వార్ లో, అశోక్ చక్ర సుజన్ సింగ్ యాదవ్ -1994, అశోక్ చక్ర సురేష్ చందు యాదవ్ -అక్షరధామ్ పై దాడిలో, అశోక్ చక్ర రామ్ నరేష్ యాదవ్ – భోపాల్ పై సిమీ ఉగ్రవాదుల దాడిలో, భారత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు అశోక్ చక్ర జగదీష్ యాదవ్ , అశోక్ చక్ర కమలేష్ కుమారి యాదవ్ ,తాజ్ కృష్ణ పై జరిగిన దాడిలో అశోక్ చక్ర జల్లు యాదవ్ కు -, ద్రాస్‌ దాడిని ఆయుష్ యాదవ్ , పుల్వామా దాడిలో, మొన్న పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో సచిన్ యాదవ్ మరియు సూరత్ సింగ్ యాదవ్ లు, ఇలా ఎందరో యాదవ (అహిర్) సామాజిక వర్గానికి చేందిన సైనిక వీరులు. మొదటి ప్రపంచం యుద్ధం ముందు నుంచి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు భారతమాత రక్షణ కోసం దేశ సైన్యంలో త్రివిధ దళాలలో వివిధ క్రియాశీలకమైన అత్యున్నత హోదాలలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారత భూమిలో జరిగిన ప్రతి యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులైన యాదవ సైనిక వీరు లెందరో వారందరికీ-వందనాలు. ఈ విధంగా యాదవుల సైనిక వారసత్వం భారత సైన్యంలో కొనసాగుతూ వస్తున్నది.

కుల ఆధారిత రెజిమెంట్ ఏర్పాటు చరిత్ర:-

1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారత సైన్యంలో కుల మరియు ప్రాంతాల ఆధారిత నియామకాలను మార్షల్, నాన్ మార్షల్ జాతులుగా విభజించింది. విశ్వాస పాత్రులైన సైనికులను నియమించడానికి సామాజిక సమూహాలు మరియు ప్రాంతాలను గుర్తించే పనిని జనార్ధన్ పీల్ కమిషన్ కు అప్పగించారు. తిరుగుబాటు భారతదేశంలోని తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చినందు వల్ల బ్రిటిష్ ప్రభుత్వం వారిని సైన్యంలో నియమించలేదు. మరియు నియామక కేంద్రాన్ని ఉత్తర భారతదేశానికి మార్చింది. అయితే స్వతంత్ర భారతదేశం వారి చరిత్ర మరియు నైతికత కారణంగా కుల మరియు ప్రాంతాల ఆధారిత రెజిమెంట్ ను కొనసాగించింది. రెజిమెంట్ వ్యవస్థ ఒక సామాజిక నిర్మాణాన్ని సృష్టించింది. ఇది దాని ప్రాంతీయ సంస్థల ద్వారా నిరంతరం విస్తరిస్తున్న కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తుంది. ఇది బెటాలియన్లలో మరియు మొత్తం రెజిమెంట్లలోసామాజిక భావాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రెజిమెంట్ నిర్మాణం సైనికులను ఒక పెద్ద కుటుంబంగా ఏకం చేస్తూ నిరంతర భావాన్ని కూడా అందిస్తుంది. ఇది ధైర్యాన్ని మరియు గర్వాన్ని పెంచుతుంది. ఈ రెండు యుద్ధసమయాలలోముఖ్యమైనవి. భారత సైన్యం వివిధ రెజిమెంట్లతో కూడి ఉంటుంది. ప్రతి దాని సొంత చరిత్ర సంప్రదాయాలు మరియు ప్రత్యేక బాధ్యతలను కలిగి ఉంటుంది. భారత సైన్యంలోని కొన్ని ప్రముఖ రకాల రెజిమెంట్స్ :-బీహార్ రెజిమెంట్,అస్సాం రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్,కుమావన్ రెజిమెంట్, నాగ రెజ్మెంట్, మద్రాస్ రెజిమెంట్, పంజాబ్ ప్రెసిడెంట్, మారాట రెజ్మెంట్, జాట్ రెజిమెంట్, మహారెజ్ మెంట్‌, రాజపుతాన రైఫిల్స్ ఉన్నాయి. బ్రిటిష్ ఆర్మీ “మార్షల్ రేస్”సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి వీరులుగా పేరొందిన కులాలను ప్రత్యేక రెజిమెంట్లుగా ఏర్పరిచారు. భారతీయ సైన్యంలో కులాధారిత‌ రెజిమెంట్లు అనేవి ఓ చ‌రిత్రాత్మ‌క‌, సమకాలిన ప్రాసాంఘికత ఉన్న అంశం. ఈ విధానం బ్రిటిష్ కాలం నాటి నుంచికొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ సైన్యంలో మిశ్రమ రెజిమెంట్లతోపాటుకొన్నికుల,ప్రాంత,భాష,ఆధారిత రెజిమెంట్లు ఉన్నాయి. అహిర్ (యాదవ్ ) వర్గానికి చెందిన జవాన్లు భారత సైన్యంలో పాతకాలం నుంచి ముఖ్యంగా చేరి సేవలందిస్తున్నారు. వారికి బ్రిటిష్ ఆర్మీలో 19వ హైదరాబాద్ రైఫిల్స్ ఉండేది. అది తర్వాత కాలంలో 1922లో 19 హైదరాబాద్ రెజిమెంట్ గా మార్చారు. తిరిగి 1945లో పేరు మార్చుకొని 19 కుమావోన్‌ రెజిమెంట్‌ గా కొనసాగి భారత స్వతంత్రం తర్వాత కుమావోన్ రెజిమెంట్ గా పునరుద్ధరించారు. ఈ రెజిమెంట్‌ యాదవులు (అహిర్) , రాజపుత్రులు,బ్రాహ్మణులు గూర్కాలు లతో కలిసి ఉంటుంది. ఈ రెజిమెంట్ లో అత్యధిక సైనికులు యాదవులు. 1962 రెజాంగ్ల యుద్ధ విజయం యాదవ సైనిక వీరులు సాధించిన సైనిక విజయం గా ప్రసిద్ధి. వీరు అసాధారణ ధైర్యాన్ని, అపూర్వ మైన శౌర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ రెజిమెంట్ యాదవ్ రెజిమెంట్ అని కూడా పిలుస్తారు.అయితే “యాదవ సైన్యమే భారత సైన్యం”అన్నంత యాదవ సైనికులు ఉన్న భారత సైన్యంలో వారికి ఇప్పటివరకు ప్రత్యేక రెజిమెంట్ లేకపోవడం బాధాక‌రం. కాబట్టి అతి త్వరలోనే ప్రత్యేకంగా అహిర్ (యాదవ ) రెజిమెంట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.

రెజాంగ్ల క‌ల‌శ‌ యాత్ర లక్ష్యం:-

1962 నవంబర్ 18న భారత్-చైనా యుద్ధంలో లడక్ లోని రెజాంగ్ల‌ ప్రాంతంలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి మరణించిన 114మందియాదవ(అహీర్ )సైనికుల ప్రాణత్యాగా లకు గుర్తుగా దేశ రక్షణ కోసంపొరాడి వీర మరణం పొందిన పవిత్ర ప్రదేశమైనా రేజాంగ్ లా నుంచి మట్టిని తీసుకొని వారి గౌరవార్థం భారత సైన్యంలో అహీర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ “అఖిల భారత యాదవ మహాసభ “భారత దేశ వ్యాప్తంగా ప్రజల మద్దత్తు కూడగడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు”రేజాంగ్ లా రాజ్ కలశ యాత్ర”ను కొనసాగిస్తున్నది. ఈ యాత్ర ఏప్రిల్ -13 -2025న బీహార్ రాష్ట్రం నుంచి ప్రారంభమై ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ, కర్ణాటక,తెలంగాణ,మహారాష్ట్ర,గుజరాత్ మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్ హర్యానా,ఢిల్లీ ఇలా దేశం మొత్తం పర్యటించి దేశ పౌరులకు భారతమాత రక్షణలో అహిర్ సైనిక వీరులు ప్రాణ త్యాగం చేసిన మట్టితో ప్రేరణ కల్పించి 142 కోట్ల పైన ఉన్న భారతీయుల మద్దతు కూడగట్టిన తర్వాత 2025 నవంబర్ 18న రెజాంగ్ల‌ దివాస్ రోజు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున దేశ పౌరులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సైన్యంలో “అహిర్ రెజిమెంట్ “ను తక్షణమే ఏర్పాటు చేయమని కోరడం జరుగుతుంది.

భారతమాత రక్షణ కోసం అనేక యుద్ధాల్లో త్రివిధ దళాల్లో వివిధ ఉన్నతమైన హోదాల్లో వీరోచితంగా పోరాటం చేసి అమరులైన సైనికులు ఎందరో వారందరికీ -వందనాలు. రేజాంగ్ల యుద్ధంలో పోరాడిన యాదవ వీరుల త్యాగం భారత సైనిక చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. అతి తక్కువ ఆయుధాలతో వేలాదిమంది శత్రు సైనికులను ఎదుర్కొని ప్రాణాలను అర్పించిన “అహీర్ (యాదవ్)(114) సైనిక వీరులు “దేశభక్తికి అర్థం ఇచ్చిన వీర యోధులు. అలాంటి శౌర్యానికి,త్యాగానికి గుర్తింపుగా ప్రత్యేకమైన రెజిమెంట్ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ న్యాయమైనదే కాదు- అది దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన సైనికులకు ఇచ్చే గౌరవం. అహిర్ రెజిమెంట్ ఏర్పాటు అంటే మరో సాధారణ సైనిక యూనిట్ ఏర్పాటు చేయడం కాదు -అది శతాబ్దాలుగా భారత మాత రక్షణ కోసం సైన్యంలో నిరూపితమైన యాదవ (అహిర్)సైనికుల శౌర్యానికి, ధైర్యానికి , దేశభక్తికి క్రమశిక్షణకు, నిబద్ధతకు, దేశం పట్ల అహిర్ (యాదవ్)జవాన్ లు చూపిన బాధ్యతకు నిర్మించాల్సిన సజీవ శిల్పం. ఇది కేవలం సామాజిక గౌరవం కోసం కాదు-సైన్యంలో సైనిక శక్తి, సమతుల్యత, ప్రాతినిథ్యం, సైనిక స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి తోడ్పాటు నందిస్తుంది. రెజాంగ్ల‌ శౌర్యాన్ని భారత సైనిక చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా గౌరవంగా నిలుపుతూ అహిర్ రెజిమెంట్ రూపంలో భవిష్యత్ తరాలకు ప్రేరణగా దిక్సూచి కావాలన్నదే మా అహిర్ (యాదవ)సామాజిక వర్గ బలమైన ఆకాంక్ష. భారతమాత రక్షణకు తమ ప్రాణాల్ని అర్పించిన యాదవ (అహిర్) సైనిక వీరులను ఒక”రెజిమెంట్”రూపంలో నిలబెట్టడం అంటే ఒక్క సైనిక అవసరం కాదు-అది భారతజాతిగా మన గౌరవబద్ధమైన కర్తవ్యం. అహిర్ (యాదవ)సైనిక వీరత్వానికి ఒక గౌరవాన్ని ఇవ్వాలి-అది సైన్యంలో అహీర్ రెజిమెంట్ ఏర్పాటు రూపంలో సాధించాలంటే అహిర్ రెజిమెంట్ ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న రెజంగ్ల‌ కలశ యాత్రలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొని తమ మద్దతుని ప్రకటించి దేశ రక్షణ కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న సైనికుల పట్ల తమ యొక్క గౌరవాన్ని,బాధ్యతని, దేశభక్తిని చాటుకోవాలి.

(అహిర్ రెజిమెంట్ ఏర్పాటు కోసం దేశ వ్యాప్తంగా సాగుతున్న రెజాంగ్ల క‌ల‌శ యాత్ర‌కు మ‌ద్ద‌తుగా రెండు తెలుగు రాష్ట్రాల ప‌రిధిలో నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న పోటీల్లో రెండో స్థానం సంపాదించిన వ్యాసం.)

ర‌చ‌యిత‌..
అంజి యాదవ్,O,U,
M.A,B,ed,(L.L.B),
గ్రామం అంతారం ,
మండలం కుల్కచర్ల,
పరిగి నియోజకవర్గం,
వికారాబాద్ జిల్లా.
970318298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
en_USEnglish